నా పిల్లలు ఏంజెల్స్ అంటున్న రేణుదేశాయ్
నా పిల్లలు ఏంజెల్స్ అంటున్న రేణుదేశాయ్
పవన్ తనయుడు అకీరా చిన్న వయసులోనే ఆరడుగుల ఆజానుబాహుడిగా మారిపోయాడు. ఇటీవల్ రేణు అకీరా స్టైలిష్ ఫోటోని ఇంస్టాగ్రామ్లో పోస్ట్ చేయగా అది వైరల్ గా మారింది.
అకీరా, ఆధ్య నేను కోరిన విధంగా ఓపికగా ఫోటోలకు ఫోజులు ఇస్తారు. నా పిల్లలు ఏంజెల్స్ అంటూ రేణు దేశాయ్ మురిసిపోతోంది. అకిరా నందన్ సూపర్ స్టైలిష్ లుక్ లో ఉన్న ఫోటోని రేణు ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.
అకిరా చిన్నతనంలో పవన్ కళ్యాణ్ లాగే ఉన్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కానీ తనకు, పవన్ కళ్యాణ్ కు అకీరా నందన్ ని జూనియర్ పవర్ స్టార్ అని పిలవడం ఇష్టం లేదని రేణు దేశాయ్ పలు సందర్భంల్లో వెల్లడించింది.
ఇటీవల రేణు దేశాయ్ నిశ్చితార్థం కూడా జరిగింది. వరుడు ఎవరనే విషయాన్ని రేణు గోప్యంగా ఉంచారు. త్వరలో వివాహం కూడా జరగబోతున్నట్లు తెలుస్తోంది. రేణు దేశాయ్ రెండో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్న తరువాత పవన్ స్వయంగా ట్విట్టర్ వేదికగా మాజీ భార్యకు శుభాకాంక్షలు తెలియజేసిన సంగతి తెలిసిందే.
Comments