అడిలైడ్ టెస్టులో "పుజారా" ఒంటరి పోరాటం..
భారత్ జట్టుని ఆదుకుంటాడని ఆశించిన కెప్టెన్ విరాట్ కోహ్లి కూడా పేలవ రీతిలో ఔటైపోయాడు. ఇన్నింగ్స్ 11వ ఓవర్ వేసిన పాట్ కమిన్స్ బౌలింగ్‌లో ఆఫ్ స్టంప్‌కి దూరంగా వెళ్తున్న బంతిని వెంటాడి స్లిప్‌లో ఉస్మాన్ ఖవాజా చేతికి విరాట్ కోహ్లి చిక్కాడు.
అజింక్య రహానె (13: 31 బంతుల్లో 1x6) కాసేపు నిలకడగా ఆడినా.. హేజిల్‌వుడ్ విసిరిన ఊరించే బంతికి దొరికిపోయాడు.
పుజారా ఒంటరి పోరాటం చేస్తున్నాడు. ఓపెనర్లు కేఎల్ రాహుల్ (2), మురళీ విజయ్ (11)తో పాటు కెప్టెన్ విరాట్ కోహ్లి (3), అజింక్య రహానె (13) వరుసగా వికెట్లను చేజార్చుకున్నా.. హిట్టర్ రోహిత్ శర్మ (37: 61 బంతుల్లో 2x4, 3x6), రిషబ్ పంత్ (25: 37 బంతుల్లో 2x4, 1x6) దూకుడుగా ఆడినా కీలక సమయంలో ఔటవగా జట్టు స్కోరు 189 వద్ద అశ్విన్ (25: 76 బంతుల్లో 1x4) కూడా పెవిలియన్ చేరిపోయాడు.
చతేశ్వర్ పుజారా (88 బ్యాటింగ్: 221 బంతుల్లో 5x4) క్రీజులో పాతుకుపోయి ఒక ఎండ్‌లో వికెట్ల పతనానికి అడ్డుకట్ట వేస్తున్నాడు. దీంతో.. 82 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ 209/7తో నిలిచింది. ప్రస్తుతం క్రీజులో పుజారాతో పాటు, ఇషాంత్ శర్మ (4) ఉన్నాడు.
Comments