అందుకే బుమ్రాని జట్టులోకి తీసుకోవాలనేది
ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ సన్నాహకంలో భాగంగా జరిగిన నాలుగు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత్ ఆటగాళ్లకు మంచి ప్రాక్టీస్ లభించింది. డిసెంబర్ 6న అడిలైడ్ వేదికగా తొలి టెస్ట్ ప్రారంభంకానున్న విషయం తెలిసిందే.
బౌలింగ్ విషయానికొస్తే వార్మప్ మ్యాచ్‌లో భారత ఫాస్ట్ బౌలర్ బుమ్రా తీసిన వికెట్ హైలైట్‌గా నిలిచింది. 65 బంతుల్లో 36 పరుగులు చేసి జోరుమీదున్న ఆసీస్ బ్యాట్స్‌మన్ జాక్సన్ కోల్‌మన్.. బుమ్రా విసిరిన బంతికి క్లీన్‌బౌల్డ్ అయ్యాడు.
అయితే బుమ్రా వికెట్ తీసిన తీరుపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘బుమ్రా బౌలింగ్ ఎంత ప్రమాదకరమో ఇప్పుడు ఆసీస్ జట్టుకు తెలిసొచ్చింది’, ‘అందుకే బుమ్రాను జట్టులోకి తీసుకోవాలనేది’ అని ప్రశంసిస్తున్నారు. టీమిండియా-ఆసీస్‌ల మధ్య నాలుగు టెస్టుల సిరీస్ డిసెంబర్ 6 నుంచి మొదలు కానుంది.
Comments