ధోని ప్రతిభను అంచనా వేయడం అసాధ్యం
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని క్రికెట్ చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్నాడు. అయితే ధోనీ మునుపటి ఫామ్‌ను సాగించలేకపోతున్నాడన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈనేపథ్యంలో సీనియర్ క్రికెటర్లు అతడికి మద్దతుగా నిలుస్తున్నారు. ఇంతకుముందులా ధోని ఆడలేకపోతున్నారన్న కారణంతో వెస్టిండీస్, ఆసీస్ టీ20 సిరీస్‌లకు అతడిని ఎంపిక చేయలేదు.
జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో ఎన్నోసార్లు ధోని ఆదుకున్నాడని, అతడిని విస్మరించడం తగదని ఇప్పటీకే టీమిండియా మాజీలు సూచించారు. అయితే ధోని ప్రతిభను తక్కువగా అంచనా వేయడం సబబు కాదని న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ స్టీఫెన్ ఫ్లెమింగ్ అభిప్రాయపడ్డారు.
కొద్దీ రోజులగా బ్యాట్‌తో విఫలమవుతూ విమర్శలు ఎదుర్కొంటున్న ధోని.. టీ20 ల్లో చోటు కోల్పోయిన విషయం తెలిసిందే. దీంతో ధోని వన్డే ప్రపంచకప్ ఆడుతాడా? లేదా అనే సందిగ్థం నెలకొంది.
ఈ నేపథ్యంలో ఐపీఎల్‌లో ధోని జట్టైన చెన్నై సూపర్ కింగ్స్ కోచ్ ప్లెమింగ్ అతనికి మద్దతుగా నిలిచాడు. భారత్‌కు చాలా అవకాశాలున్నాయనీ, కానీ ధోనికి ప్రపంచకప్ ఆడే సత్తా ఉందన్నారు. ఐపీఎల్‌లో అతని బ్యాటింగ్‌ను దగ్గరి నుంచి చూసినట్లు ఓ మీడియా ఛానెల్‌కు తెలిపారు. వన్డే ప్రపంచకప్‌లో అతను రాణిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు.
ఈ ఏడాది 20 వన్డే మ్యాచ్‌లాడిన 25 సగటుతో 275 పరుగులే చేశాడు. దీంతో అతనిపై, అతని బ్యాటింగ్‌పై విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలోనే వెస్టిండీస్, ఆస్ట్రేలియాతో జరిగే టీ 20 సిరీస్‌లకు అతన్ని ఎంపికచేయలేదన్న విషయం తెలిసిందే. అయితే సెలక్టర్ల నిర్ణయంపై అభిమానులు సోషల్ మీడియా వేదికగా తప్పుబట్టారు. ధోని బ్యాట్ ఝులిపించకపోయినా.. తన మార్క్ కీపింగ్, అనుభవం, వ్యూహాలు జట్టు విజయానికి తోడ్పడుతాయని అభిప్రాయం వ్యక్తం చేశారు.
టీమిండియాకు ఎన్నో విజయాలు అందించిన ధోనికి ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతోందనడం హాస్యాస్పదంగా ఉంది అని అన్నారు. ఫ్లెమింగ్ ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు కోచ్‌గా వ్యవహరిస్తున్నారు.
Comments