ఆస్ట్రేలియా vs ఇండియా, తొలి టెస్టు
మరికొన్ని గంటల్లో అడిలైడ్ వేదికగా ఇరు జట్ల మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఆసీస్ గడ్డపై టీమిండియా ఇప్పటివరకు టెస్టు సిరిస్‌ను గెలవలేదు.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. తొలి టెస్టుకు ఇరు దేశాలు తమ తుది జట్లను ప్రకటించాయి.
ఆసీస్ పై గత రికార్డు:
ఆసీస్ గడ్డపై ఇప్పటివరకు 44 టెస్టులాడిన టీమిండియా కేవలం ఐదు మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించింది. 11 టెస్టు సిరిస్‌లను ఆడింది.ఇందులో కేవలం రెండు సార్లు మాత్రమే టెస్టు సిరిస్‌ను డ్రాగా ముగించింది.
1980-81లో సునీల్ గవాస్కర్ నాయకత్వంలో మొదటి టెస్టు సిరిస్ మరియు 2003-04లో గంగూలీ నాయకత్వంలో రెండోసారి టెస్టు సిరిస్‌ను డ్రాగా ముగించింది.
జట్ల వివరాలు:
భారత జట్టు: విరాట్ కోహ్లీ(కెప్టెన్), మురళీ విజయ్, కేఎల్ రాహుల్, పుజారా, ఆజింక్య రహానె, రోహిత్ శర్మ, హనుమ విహారి, రిషబ్ పంత్(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, మహమ్మద్ షమీ, ఇషాంత్ శర్మ, జస్ర్పిత్ బుమ్రా
ఆస్ట్రేలియా జట్టు: టిమ్ పైన్(కెప్టెన్), అరోన్ ఫించ్, మార్కస్ హారిస్, ఉస్మాన్ ఖవాజ, షాన్ మార్ష్, ట్రావిస్ హెడ్, పీటర్ హాండ్స్‌కాంబ్, జోష్ హేజిల్‌వుడ్, పాట్ కమిన్స్, నాథన్ లైయన్, మిచెల్ స్టార్క్
ఈ సిరిస్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి మద్దతుగా ఏ క్రికెటర్ నిలబడతాడనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే కెప్టెన్ కోహ్లీ ఎప్పుడైతే ఔటవుతాడో ఆ వెంటనే భారత బ్యాట్స్‌మన్ పెవిలియన్‌కు క్యూ కడతారు కాబట్టి.
ఈ ఏడాది మొదట్లో దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో కోహ్లీ 286 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆ తర్వాత పాండ్యా (119), పుజారా(102), కేఎల్ రాహుల్(రెండు టెస్టుల్లో 30) పరుగులకే ఔటైన సంగతి తెలిసిందే. అయితే, ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో కేఎల్ రాహుల్ 299 పరుగులు చేయడం విశేషం.
బౌలింగ్:
తొలి టెస్టుకు టీమిండియా ఇషాంత్ శర్మ, షమీ, జస్ప్రీత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్‌లతో బరిలోకి దిగే అవకాశం ఉంది. ఇక, ఆస్ట్రేలియా విషయానికి వస్తే మిచెల్ స్టార్క్, ప్యాట్ కమ్మిన్స్, జోష్ హేజెల్‌ఉడ్, నాథన్ లయాన్‌తో బరిలోకి దిగనుంది.
మ్యాచ్ ప్రసారమయ్యే ఛానళ్లు:
సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం
ఉదయం 5.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం
సోనీ లివ్‌లో ఆన్‌లైన్ స్ట్రీమింగ్
Comments