తెలుగు బాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన పీఎం మోదీ
![తెలుగు బాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన పీఎం మోదీ](https://aptg.s3.us-east-2.amazonaws.com/uploads/1598720012Untitled%20design%20%2812%29.jpg)
వ్యావహారిక భాషోద్యమ నాయకుడు గిడుగు రామ్మూర్తి జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటాం. ప్రతి సంవత్సరం ఆర్బాటంగా సాగే వేడుకులు, లాక్ డౌన్ వల్ల ఈరోజు జరుపోకోలేకపోవటం విచారకరం అయ్యినప్పటికీ ఎందరో ప్రముఖులు సామాజిక మాధ్యమాల ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ వేదికగా తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు..
‘తెలుగు భాషాభివృద్ధికి పాటుపడుతున్న అందరికీ ముఖ్యంగా యువతకి నా ధన్యవాదాలు. తన సాహిత్యంతో, తన సాంఘిక సంస్కరణా దృక్పథంతో ఎన్నో తరాలను ఉతేజ్జపరచిన గిడుగు వెంకటరామ్మూర్తి గారికి నివాళులు’ అని మోదీ ట్వీట్ చేశారు.
ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య కూడా తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఉన్నతమైన సమాజ నిర్మాణం కోసం భాష, సంస్కృతులే చక్కని పునాది వేస్తాయని ఆయన పేర్కొన్నారు. బాషా దినోత్సవం అంటే స్వాభిమానమని, విదేశాల్లో ఉంటూ మాతృబాష కోసం పరితపించే ప్రతి ఒక్కరికి ఉపముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలియజేసారు.
Comments