కుప్పకూలిన రెండు అమెరికా సైనిక విమానాలు
రెండు విమానాలు అమెరికా సైన్యానికి చెందినవి పసిఫిక్ మహాసముద్రంలో కుప్పకులాయి, జపాన్ నైరుతి వైపు సముద్రంలో ఈ ఘటన జరిగింది.
తెల్లవారు జామున 2 గంటల ప్రాంతంలో ఎఫ్-18 యుద్ధవిమానం, సీ-130 రిఫ్యూయెలింగ్ విమానం సాధారణ శిక్షణలో ఉండగా.. రెండు విమానాలు గగనతలంలో ప్రమాదానికి గురై సముద్రంలో పడిపోయాయి.
ఈప్రమాదంలో విమానాల్లో ఉన్న ఆరుగు మెరైన్లు ( నావికాదళ సిబ్బంది) గల్లంతయ్యారు.
సముద్రంలో పడిపోయి గల్లంతైన సిబ్బందిలో ఒకరిని సహాయక సిబ్బంది రక్షించారు.గల్లంతైన మిగతా మెరైన్ల కోసం గాలిస్తున్నారు.నాలుగు విమానాలు, మూడు నౌకలతో గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు తెలిపారు.
సీ-130లో ఐదుగురు సిబ్బంది, ఎఫ్-18లో ఇద్దరు సిబ్బంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
ఆకాశంలో ఉండగా ఇంధనం నింపే ఆపరేషన్ చేపడుతుండగా ఈ దుర్ఘటన జరిగినట్లు జపాన్ రక్షణ మంత్రి వెల్లడించారు.
అమెరికా సైన్యానికి చెందిన దాదాపు 50వేల మంది సిబ్బంది జపాన్లో విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే ఇలాంటి ప్రమాదాలు జరగడం చాలా అరుదు.నవంబరులో అమెరికా యుద్ధ విమానం జపాన్ ద్వీపం ఒకినావా సమీపంలో సముద్రంలో కూలిపోయింది. కానీ అందులోని ఇద్దరు సిబ్బంది ప్రాణాలతో బయటపడ్డారు.
Comments