కియా మోటార్స్‌తో ఏపి ప్రభుత్వం ఒప్పందం
ఈరోజు ఉదయం సచివాలయంలో ప్రముఖ కార్ల తయారీ కంపెనీ కియా మోటార్స్‌తో ఏపీ ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.
అనంతరం ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్ ఎలక్ట్రికల్ కార్లను సిఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా కియా బ్యాటరీ కార్లను స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించారు.
కార్ల ప్రత్యేకతలను కియా ప్రతినిధులు వివరించారు. అనంతరం సీఎం ప్రారంభించిన నిరో హైబ్రిడ్, నిరో ప్లగ్ ఇన్ హైబ్రిడ్, నిరో ఎలక్ట్రికల్ కార్లను కియా మోటార్స్ రాష్ట్ర ప్రభుత్వానికి బహుమతిగా ఇచ్చింది.
ఈ సందర్భంగా ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు కియా మోటార్స్ ముందుకు రావడం ఆనందంగా ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. భవిష్యత్‌లో ఇంకా పెద్దఎత్తున పెట్టుబడులు రానున్నాయని చెప్పారు. కియా మోటార్స్ సంస్థ ప్రతినిధులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా చెప్పారు.
ఈ కార్లు ఒక్కసారి ఛార్జింగ్ చేసుకుంటే 455 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేసే వీలుంటుంది.
Comments