క్రేజీ దర్శకుడితో అనుష్క..
అనుష్క సినిమా ఎప్పుడెప్పుడా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తుంటే బొమ్మాలి మాత్రం అజాతంలోకి వెళ్లిపోయారు. తాజాగా అనుష్కకు సంబంధించిన ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ప్రముఖ బ్యానర్లో, క్రేజీ దర్శకుడితో సినిమా చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి.
ప్రస్తుతం అనుష్కకు సంబంధించిన మరో ప్రాజెక్ట్ తెరపైకి వచ్చింది. ఓ హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాకు అనుష్క పచ్చ జెండా ఊపారనే విషయం మీడియాలో హల్చల్ చేస్తున్నది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ రూపొందించనున్నట్టు.. ఆ సినిమాకు చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వం వహిస్తున్నట్టు వార్తలు
ఈ రెండు సినిమాల వార్తలను పక్కన పెడితే ప్రస్తుతం అనుష్కను వేధిస్తున్న సమస్య లావు, లావు తగ్గేందుకు అనుష్క ఆస్ట్రేలియాకు వెళ్లినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై కూడా క్లారిటీ లేదు.
అనుష్క బరువు తగ్గినా గానీ ఎక్కువ సినిమాలు చేయకపోవచ్చని, కొన్ని సినిమాలు చేస్తే చేయవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
ఆస్ట్రేలియా నుంచి వచ్చిన తర్వాత చంద్రశేఖర్ ఏలేటి సినిమాతో పాటు లేడి ఓరియెంట్ సినిమాలు చేయడానికి ఉత్సాహం చూపుతున్నారట. ఓ పక్క సినిమాలపై చర్చ జరుగుతుంటే.. మరో పక్క అనుష్క పెళ్లి వార్తలు కూడా భారీగానే వస్తున్నాయి.
Comments