నేడూ రేపూ కీలకం: తెరాస అభ్యర్థులకు సీఎం ఫోన్
ప్రచారం ముగిసింది.. కీలకమైన పోలింగ్ ఘట్టం దగ్గరపడింది.. పార్టీలన్నీ చివరిరోజున అనుసరించాల్సిన వ్యూహంపై దృష్టి పెట్టాయి.
రాష్ట్రంలో మొత్తం 32,815 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటయ్యాయి.పోల్ మేనేజ్‌మెంట్.. పార్టీలకు ఇదో కఠిన పరీక్ష.
అభ్యర్థులు.. ముఖ్యనేతలంతా ఇప్పుడు అదే పనిలో పడ్డారు. గజ్వేల్‌లో ఎన్నికల ప్రణాళిక ముగిసిన వెంటనే ముఖ్యమంత్రి, తెరాస అధినేత కేసీఆర్ పోలింగ్ సన్నాహాలపై ముఖ్యనేతలతో సమావేశమయ్యారు.
అనంతరం ఎన్నికల రోజున వ్యవరించాల్సిన తీరుపై అభ్యర్థులతో ఫోన్‌లో మాట్లాడారు.అభ్యర్థులు ఉదయం నుంచి సాయంత్రం ఓటింగు ముగిసే వరకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎన్నికల్లో ప్రతీ ఓటు కీలకమైందని, దీనికి అనుగుణంగా పనిచేయాలన్నారు.
ఉదయం నుంచే ప్రతి పోలింగ్ కేంద్రాన్ని సందర్శించాలని, ఏజెంట్లుగా ఉన్న కార్యకర్తలకు అన్ని జాగ్రత్తలు చెప్పాలని సూచించారు. ప్రజలను కలిసి అభివాదాలు చేయాలని, వారిని మనస్ఫూర్తిగా అభినందించాలని చెప్పారు.
పోలింగ్ సందర్భంగా పార్టీ శ్రేణులు, నేతలు పూర్తి సమన్వయంతో వ్యవహరించాలని.. అభ్యర్థుల పర్యవేక్షణలో పనిచేయాలని తెరాస అధిష్ఠానం సూచించింది.
Comments