కేంద్ర మంత్రి చెంప చెళ్లుమనిపించిన యువకుడు!
మహారాష్ట్రలోని అంబర్‌నాథ్‌లో శనివారం రాత్రి జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న అథవాలే తిరిగి వెళ్తుండగా అనూహ్య ఘటన జరిగింది.
మంత్రి అథవాలే వేదిక దిగి తన వాహనం దగ్గరకు వెళ్తున్న సమయంలో అకస్మాత్తుగా ఓ వ్యక్తి ఆతనివైపు దూసుకొచ్చి మంత్రిగారి చెంప చెళ్లుమనిపించాడు.
వెంటనే మంత్రిగారి అనుచరులు ఆవ్యక్తిని పట్టుకుని దేహశుద్ధి చేశారు.నిందితుడిని ప్రవీణ్ గోసావిగా పోలీసులు గుర్తించారు.ఈ విషయం బయటకు పొక్కడంతో ఆయన అభిమానులు, రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడకు తరలివచ్చారు.
అథవాలేపై దాడికి నిరసనగా రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చారు.
గతంలో భీమాకొరెగావ్ ఘర్షణలపై కేంద్ర మంత్రి రామదాస్ అథవాలే చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. దళిత హక్కుల కార్యకర్తలపై మావోయిస్టు ముద్రవేసి అరెస్టుచేయడం సరికాదంటూ ఎన్డీయే భాగస్వామిగా ఉన్న అథవాలే వ్యాఖ్యలు చేశారు.
అలాగే క్రికెట్‌లో రిజర్వేషన్ల విధానం అమలు చేయాలని డిమాండ్ చేయడం, రాజ్యాంగంలోని రిజర్వేషన్లను 75 శాతానికి పెంచాలంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై పెను దుమారమే రేగింది.
మంత్రిపై ప్రవీణ్ ఎందుకు దాడిచేశాడనే విషయం మాత్రం తెలియరాలేదు.
Comments