KTR.. ఓడితే సర్దుకొని అమెరికా వెళ్లిపోతారా?
ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోతే కేటీఆర్ అమెరికా వెళ్లిపోతారా? లగడపాటితో కేటీఆర్ వాట్సాప్ చాట్ అంటూ ప్రచారం.
ప్రజా కూటమికే విజయావకాశాలు ఉన్నాయన్న లగడపాటి అంచనాలు టీఆర్ఎస్ నేతలకు మింగుడు పడటం లేదు. ఈ సర్వే ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉందన్న కేటీఆర్.. చంద్రబాబు నాయుడి ఒత్తిడితోనే లగడపాటి సర్వే తారుమారైందన్నారు.
నవంబర్ 20వ తేదీన రాజగోపాల్ తనకు పంపిన మెస్సేజ్‌లో టీఆర్‌ఎస్ 65 నుంచి 70 సీట్లు, ప్రజా కూటమి 35-40 సీట్లు, బీజేపీ 2-3 సీట్లు, ఎంఐఎం 6 లేక 7 సీట్లు, ఇతరులు ఒకటి లేదా రెండు స్థానాల్లో నెగ్గుతారని సర్వే వివరాలు వెల్లడించారని కేటీఆర్ స్క్రీన్ షాట్లు షేర్ చేశారు.
‘క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోంది. ఎన్నికల గురించి నేను వింటోంది నిజమేనా? మీ గురించి బెంగగా ఉంది’ అని ఆ చాట్ చేసిన వ్యక్తి రావు కె.టి.తో చాట్ చేశారు.
దీనికి బదులుగా.. ‘ఇవి రాజకీయాలు, పరిణామాలు వేగంగా మారుతున్నాయి. కొద్ది రోజుల క్రితం వరకు మెరుగ్గా ఉన్న మా అవకాశాలు ఇప్పుడు సన్నగిల్లుతున్నాయి. మా సర్వేలు ఆనందాన్ని కలిగించడం లేదు. నాన్న సమర్థవంతంగా వ్యవహరించలేకపోతుండటం చిరాకు తెప్పిస్తోంది.
మేం గెలవకపోతే.. నేను అమెరికా వెళ్తా లేదంటే వేరే దేశం వెళ్తాను. అంతేగానీ ప్రతిపక్షంలో మాత్రం కూర్చోన’ని కేటీఆర్ తెలిపారు. లగడపాటితో కేటీఆర్ వాట్సాప్ చాట్ వైరల్‌గా మారిన ఈ చాట్ ఫేక్ అని తేలింది.
ఈ చాటింగ్‌తో తనకు సంబంధం లేదని లగడపాటి మీడియాకు తెలిపారు. ఆయన అమెరికా వెళ్తానని నాతో చెప్పలేదు. కేసీఆర్ గురించి కూడా ఆయన నాకేమీ చెప్పలేదని లగడపాటి స్పష్టం చేశారు.
Comments