ఆసీస్‌తో తొలి టెస్టు: ఆరు వికెట్ కోల్పోయిన భారత్
ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ కష్టాల్లో పడింది.
127 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. లైయన్ వేసిన 50వ ఓవర్ తొలి బంతిని ఎదుర్కొన్న రిషబ్ పంత్ (25 ;38 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) పైన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
ప్రస్తుతం 56 ఓవర్లు ముగిసేసమయానికి భారత్ 6 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది.
పుజారా 46, అశ్విన్ 5 పరుగులతో క్రీజులో ఉన్నారు.
లైన్ వేసిన 37.3వ బంతికి రోహిత్ (37: 61) మార్కస్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో 86 పరుగులకే భారత్ ఐదు వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం భారత్ 40 ఓవర్లకు ఐదు వికెట్లు కోల్పోయి 92 పరుగులు చేసింది.
మ్యాచ్ ప్రసారమయ్యే ఛానళ్లు:
సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం
ఉదయం 5.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం
సోనీ లివ్‌లో ఆన్‌లైన్ స్ట్రీమింగ్
Comments