ఆసీస్‌పై టీమిండియా చారిత్రక విజయం
అడిలైడ్ టెస్టులో ఆసీస్ జట్టుపై కోహ్లీసేన 31 పరుగుల తేడాతో చారిత్రక విజయం నమోదు చేసింది. దాదాపు 11 ఏళ్ల తర్వాత కంగరూ గడ్డపై భారత్ తొలిసారిగా టెస్టు విజయాన్ని నమోదు చేసింది.
చివరిసారిగా 2008లో పెర్త్‌లో ఆసీస్‌పై విజయం సాధించింది. ఆసీస్ పర్యటనలో సిరీస్‌లో తొలి టెస్టు గెలవడం భారత్‌కు ఇదే తొలిసారి కావడం గమనార్హం.
గత రెండు పర్యటనల్లోనూ ఒక్క టెస్టు కూడా భారత్ గెలవలేదు. నాలుగు టెస్టుల సిరీస్‌లో భారత్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది.
టీమిండియా తొలి ఇన్నింగ్స్: 250
ఆసీస్ తొలి ఇన్నింగ్స్: 235
టీమిండియా రెండో ఇన్నింగ్స్: 307
ఆసీస్ రెండో ఇన్నింగ్స్: 291
Comments