నగరంలో వన్డే ప్రపంచకప్
నిస్సాన్ సంస్థ చేపట్టిన ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ ట్రోఫీ టూర్ బుధవారం సాయంత్రం హైదరాబాద్‌కు చేరుకుంది. గచ్చిబౌలిలోని నిస్సాన్ షోరూమ్‌లో అభిమానుల సందర్శనార్థం ఈ ట్రోఫీని ఉంచారు. క్రికెట్ అభిమానులు ట్రోఫీని చూసేందుకు ఆసక్తి చూపారు. ట్రోఫీ పక్కన నిల్చుని సెల్ఫీలు తీసుకునేందుకు పోటీపడ్డారు. ఈ సందర్భంగా వర్షిణి మాట్లాడుతూ... 2019 వరల్డ్‌కప్‌ను భారత్ గెలవాలని కోరుకుంటున్నానని చెప్పారు.
ఈ కార్యక్రమంలో వైబ్రెంట్ నిస్సాన్ షోరూమ్ ఎండీ సిరాజ్ బాబూఖాన్ పాల్గొన్నారు. అనంతరం నిస్సాన్ కంపెనీ కొత్త ఉత్పత్తి ‘నిస్సాన్ కిక్స్’ కారును సైతం ఈ సందర్భంగా ఆవిష్కరించారు. మన రోడ్లకు అనుగుణంగా న్యూ నిస్సాన్ కిక్స్ కారును రూపొందించారని తెలిపారు.
Comments