పెళ్లికి ముందు.. పెళ్లి తర్వాత!!! f2 టీజర్
‘ఒక చరిత్ర గురించి చెప్పాలంటే క్రీస్తుపూర్వం, క్రీస్తుశకం అంటాం.. ఒక మగాడి గురించి చెప్పాలంటే పెళ్లికి ముందు పెళ్లికి తర్వాత..’ అంటున్నారు వెంకటేశ్. పెళ్లి చేసుకున్న వాళ్ల కష్టాల మీద సెటైరికల్‌గా అనిల్ రావిపూడి తెరకెక్కించిన చిత్రం ‘ఎఫ్ 2’. ‘ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’ అన్నది ఉపశీర్షిక.
వెంకటేశ్, వరుణ్‌తేజ్ హీరోలుగా ‘దిల్’ రాజు నిర్మించారు. తమన్నా, మెహరీన్ కథానాయికలుగా నటించారు. సంక్రాంతికి కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా ‘f2’ టీజర్‌ను విడుదల చేశారు. ‘సంక్రాంతికి గట్టిగా నవ్వించేట్టున్నారుగా?’ అని ఓ పాత్ర అడగ్గా. ‘అంతేగా.. అంతేగా..’ అంటూ నవ్వులు పంచారు వెంకీ, వరుణ్.
Comments