అందుకే రేవంత్‌ను అరెస్ట్ చేశాం : Rajath Kumar
కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గిలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభను మంగళవారం నిర్వహించనున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి నియోజకవర్గ బంద్‌కు పిలుపునిచ్చారు. కేసీఆర్ సభలో ఆందోళన చేపట్టేందుకు రేవంత్ తన అనుచరులను ప్రోత్సహించారని పోలీసులు భావించారు.
దీంతో తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్ స్పందించారు. తాము ఎన్నికల నిబంధనలను పాటిస్తున్నామని, శాంతిభద్రతల అంశాన్ని దృష్టిలో ఉంచుకొని ముందస్తుగా రేవంత్‌ను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.
దీంతో కొడంగల్‌లో శాంతి భద్రతలకు ఎలాంటి భంగం వాటిల్లకూడదని మంగళవారం (డిసెంబర్ 4) తెల్లవారుజామున 3 గంటలకు బలవంతంగా రేవంత్‌ను అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు.
పార్టీ కీలకనేత రేవంత్‌రెడ్డిని అరెస్ట్ చేసేందుకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని, తమను ఎదుర్కోలేక అక్రమ అరెస్టులు చేస్తున్నారని ఆరోపించారు.
Comments