వజ్రాల వ్యాపారి హత్య: పోలీసుల అదుపులో ప్రముఖ నటి
ముంబైకి చెందిన ఓ వజ్రాల వ్యాపారి మరణంతో ప్రముఖ టీవీ నటి దేవొలీనా భట్టాచార్జీ కి కనెక్షన్ ఉందని భావించిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
ఈ విషయం హిందీ సినీ వర్గాల్లో చర్చనీయాంశం అయింది.
57 ఏళ్ల రాజేశ్వర్ ఉదాని నవంబర్ 28 నుంచి కనిపించకుండా పోయాడు.కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు మొదట మిస్సింగ్ కేసుగా నమోదు చేసి పోలీసులు తర్వాత కొడ్నాప్ అయినట్లు తేల్చారు.
ఈ ఘటనకు సంబంధించి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రాయ్‌గఢ్ జిల్లాలోని ఓ అటవీ ప్రాంతంలో రెండు రోజుల క్రితం రాజేశ్వర్ ఉదాని శవమై కనిపించాడు.అయితే, పది రోజుల అనంతరం వ్యాపారి మృతదేహం కుళ్లిన స్థితిలో రాయ్‌గఢ్‌లోని పన్వేల్ ప్రాంతంలో పోలీసులు గుర్తించారు.
రాజేశ్వర్ ఉదాని కాల్ డేటాను పరిశీలించారు. సినీ, టీవీ ఇండస్ట్రీకి చెందిన పలువురు మహిళలను ఈ వ్యాపారి తరచుగా కలిసేవాడని వారి దర్యాప్తులో తేలింది.
మహారాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి వద్ద గతంలో పనిచేసిన సచిన్ పవార్ అనే వ్యక్తి.. టీవీ, సినిమా రంగాలకు చెందిన మహిళలను వ్యాపారికి పరిచయం చేసేవాడని తేల్చారు.దేవొలీనాతో పాటు పొలిటీషియన్ సచిన్ పవార్‌ను పోలీసులు శనివారం కొన్ని గంటల పాటు విచారించారు.
అతడిని కిడ్నాప్ చేసిన వారు ఒక ప్రదేశంలో చంపేసి పాన్‌వెల్ అడవిలో మృతదేహాన్ని వదిలి వెళ్లినట్లు అనుమానిస్తున్నారు. ఫోన్ డాటా చెక్ చేసిన పోలీసులకు రాజేశ్వర్ రెగ్యులర్‌గా కొన్ని బార్లకు వెళ్లేవాడని, గ్లామర్, ఎంటర్టెనింగ్ రంగానికి చెందిన మహిళలతో సంబంధాలు ఉండేవని, సచిన్ పవార్ ద్వారా అతడు వారిని కలిసేవాడని పోలీసులు గుర్తించారు.
ఈ కేసుతో దేవొలీనా కి ఎటువంటి సంబంధం ఉందన్న విషయాన్ని మాత్రం పోలీసులు వెల్లడించలేదు. ఈ హత్య కేసులో ఇంకా సినీ, టీవీ పరిశ్రమకు చెందిన పలువురు మహిళలను విచారించనున్నట్లు పోలీసులు తెలిపారు. ‘సాథ్ నిభానా సాథియా’ (తెలుగులో ‘కోడలా కోడలా కొడుకు పెళ్లమా’) లాంటి ప్రముఖ హిందీ సీరియళ్లలో దేవొలీన నటిస్తున్నారు.
Comments