ఎన్నికల కిక్కు, విదేశీ మద్యాన్ని ఎక్కువగా మోజు పడుతున్నారు
ఎన్నికల నేపథ్యంలో తక్కువ ధర మద్యం కంటే.. ఎక్కువ ధర ఉండే మద్యం సీసాల వినియోగం భారీగా పెరిగింది. రోజుకి రూ.200 మద్యం తాగే వ్యక్తి.. ప్రస్తుతం రెట్టింపు విలువైన మద్యం తాగేస్తున్నాడు.
వాటిపైనే మోజు..
ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా విదేశీ మద్యం అమ్మకాలు భారీ స్థాయిలో జరుగుతున్నాయి. స్వదేశంలో విదేశీ మద్యాన్ని ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువత ఎక్కువగా విదేశీ మద్యం తాగుతున్నారు..
విదేశీ మద్యంపై అదనపు పన్ను వేసి అమ్మే విధానానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే అనుమతి లభించింది. దీనిని తెలంగాణ రాష్ట్రం కొనసాగిస్తోంది. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా విదేశీ మద్యం అమ్మకాలు భారీ స్థాయిలో జరుగుతున్నాయి.
ఒక్క బీరు అమ్మకాలే 20శాతం వరకు పెరగడం విశేషం. గతంతో పోల్చితే ఈ పెరుగుదల సగటున 20 శాతంగా నమోదైంది.
హైదరాబాద్ జిల్లాలో 184 మద్యం దుకాణాలు, 250 బార్లకు అబ్కారీశాఖ అనుమతి ఇచ్చింది. వీటిల్లో ఈ ఏడాది అక్టోబరు, నవంబరు అమ్మకాలను.. గత ఏడాది అదే నెలలతో పోల్చితే 25శాతం మించి జరిగాయి. ఆబ్కారీశాఖ అధికారులు వేసిన అంచనాను మించి అమ్మకాలు సాగడం విశేషం.
మద్యం సీసాలను ఇళ్లవద్ద పంపిణీ చేసే కాలం పోయింది.. ప్రస్తుతం దుకాణదారుడితోనే పలువురు అభ్యర్థులు ఒప్పందాలు చేసుకొంటున్నారు. నేరుగా దుకాణం వద్దకు అభ్యర్థి తరఫున మందుబాబులు వెళ్లి.. వారి ఖాతాలో మద్యం తీసుకొనే విధానానికి తెర లేపారు.దీంతో ఖజనాకు భారీస్థాయిలో ఆదాయం సమకూరుతోంది.
తెలంగాణ ఏర్పాటుకి ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం ఆదాయంతో పోల్చితే.. ప్రస్తుతం రాష్ట్రంలో వస్తున్న ఆదాయం ఎక్కువగా ఉండటం విశేషం. ఒక్క గుడుంబా నిర్మూలనతోనే తెలంగాణ వ్యాప్తంగా నెలకు రూ.300 కోట్లు విలువైన మద్యం అమ్మకాలు అదనంగా జరుగుతున్నాయి. ఏడాదికి రూ.3,600 కోట్లు వరకు అదనపు ఆదాయం సమకూరుతోంది.
Comments