రెండో టెస్టుకు ఆశ్విన్, రోహిత్ దూరం
టిమిండియా రెండో టెస్టు ఆరంభానిక ముందే ఎదురుదెబ్బ తగిలింది. పెర్త్ వేదికగా జరిగే ఈ టెస్టుకు గాయం కారణంగా స్పిన్నర్ రవిచంద్రన్ ఆశ్విన్, బ్యాటిమన్ రోహిత్ శర్మ దూరమయ్యారు. మరోవైపు గాయంతో తొలి టెస్టుకు దూరమైన ఓపెనర్ పృథ్వీషా ఇంకా కోలుకోలేదు.
దీంతో వీరి స్థానాల్లో హునుమ విహారీ, రవీంద్ర జడేజా, ఉమేశ్ యాదవ్, భువనేశ్వర్ కుమార్‌ను ఎంపిక చేశారు. ‘పృథ్వీ షా గాయం నుంచి కోలుకుంటున్నాడు. అయితే అతడికి ఇంకా ట్రీట్‌మెంట్ కొనసాగుతోంది. పొత్తి కడుపులో నొప్పి కారణంగా స్పిన్నర్ అశ్విన్ రెండో టెస్టుకు దూరమవుతున్నాడు. వెన్నునొప్పి కారణంగా రోహిత్ శర్మ కూడా ఈ టెస్టులో ఆడట్లేదు’ అని బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది.
ఆస్ట్రేలియాలో టెస్ట్ సిరీస్ గెలవాలన్న కసితో ఉన్న టీమిండియాకు అశ్విన్ లేకపోవడం ఎదురుదెబ్బే అని చెప్పాలి. మరోవైపు పెర్త్ పిచ్ టీమిండియా కంటే ఆసీస్ ఆటగాళ్లకే ఎక్కువ అనుకూలంగా ఉంటుంది. శుక్రవారం నుంచి రెండో టెస్టు ప్రారంభం కానుంది.
Comments