అవసరమైతే తెలంగాణ కోసం చస్తా.. : కేసీఆర్
ఎన్నికల్లో చివరి సభ నిర్వహించిన గజ్వేల్‌లో కేసీఆర్ కీలక ప్రసంగం చేశారు. గజ్వేల్ సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ కోసం చేసిన పోరాటంలో కోమాలోకి పోతవని డాక్టర్లు హెచ్చరించినా వెనక్కి తగ్గలేదు.
అంతకష్టపడి పోరాడి సాధించ్చుకున్న తెలంగాణను తన కంఠంలో ప్రాణం ఉండగా, ఎవరికీ బానిసను కానియ్యనని.. అవసరమైతే చస్తా అని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు.
ఇప్పటివరకు తాను పోరాడానని, ఇకనుంచి తెలంగాణ ప్రజలు పోరాడాల్సి ఉంటుందని... ప్రజా కూటమిని ని తెలివితో దెబ్బ కొట్టాలని సూచించారు.
ఏపీ నుంచి చంద్రబాబు కరెంట్ ఇవ్వడు. ఇక్కడేమో తెలంగాణ అసెంబ్లీలో చంద్రబాబు కింద పనిచేసే బ్రోకర్ ఎమ్మెల్యేలు.. కరెంట్ కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తారు. ఇలాంటి దుర్మార్గపూరితంగా వ్యవహరించిన చంద్రబాబును మళ్లీ తెలంగాణలోకి ఆహ్వానిస్తారా.
అన్ని వర్గాలతో పాటు రైతు సోదరులకు 24 గంటలు విద్యుత్ ఇచ్చే ప్రభుత్వం టీఆర్‌ఎస్ అని కేసీఆర్ ఉద్వేగభరితంగా ప్రసంగించారు.
మైనింగ్ డిపార్ట్‌మెంట్‌లో ఇసుక ఉంటది. 10 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఆదాయం 9.56 కోట్లు. టీఆర్‌ఎస్ పాలనలో ఇసుక మీద 2057 కోట్ల ఆదాయాన్ని సాధించాం. మరో టర్మ్ అధికారమిస్తే మొత్తం 10 వేల కోట్ల రూపాయాలు ఆదాయాన్ని తెలంగాణకు సాధించిపెడతాం.
Comments