కల్వకుర్తి కాంగ్రెస్ అభ్యర్థిపై రాళ్లదాడి..
మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్ రెడ్డిపై గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లదాడికి పాల్పడ్డారు. నాగర్ కర్నూల్ జిల్లా ఆమనగల్ మండలం జంగారెడ్డి పల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది.
వంశీచంద్ ఓ పోలింగ్ కేంద్రానికి వెళ్తుండగా గుర్తు తెలియని దుంగడులు ఆయన వాహనంపైకి రాళ్లు విసిరారు. దీంతో వాహనం అద్దాలు ధ్వంసమై లోపలి ఉన్న వంశీచంద్ రెడ్డికి తీవ్ర గాయాలు అయ్యాయి.
గాయపడిన ఆయనకు ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు. అమనగల్ ప్రాథమిక ఆరోగ్యం కేంద్రంలో వైద్యులు ఆయనకు చికిత్స చేయడానికి నిరాకరించారని భోగట్టా.
ఘటనకు ముందు పోలింగ్ బూత్ వద్ద కాంగ్రెస్-బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఇరువర్గాలు తోపులాటకు దిగాయి. దీని గురించి సమాచారం తెలిసిన వంశీచంద్‌రెడ్డి అక్కడకు చేరుకోగా ఆయనపై కూడా బీజేపీ కార్యకర్తలు దాడికి పాల్పడడంతో గాయాలయ్యాయి. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని ఇరువర్గాల వారిని అక్కడనుంచి పంపించివేశారు
ఈ దాడికి పాల్పడింది బీజేపీ కార్యకర్తలేనని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.
ఈ ఘటనలో ఐదుగురికి గాయాలు కాగా, పోలింగ్ కేంద్రం ముందే ఇది జరగడం ఆశ్చర్యకరం. వరంగల్ రూరల్ ఖానాపూర్ మండల కేంద్రంలో టీఆర్ఎస్-కాంగ్రెస్ వర్గీయుల మధ్య ఘర్షణ, తోపులాట చోటుచేసుకుంది.
Comments