అశ్విన్ బంతికి మొద్దుబారిన ఫించ్ మెదడు..!
ఈరోజు రెండో సెషన్‌లో భారత్ జట్టు 307 పరుగులకి ఆలౌటవగా.. 323 పరుగుల లక్ష్య ఛేదనకి దిగిన ఆస్ట్రేలియా జట్టు తొలి ఓవర్‌లోనే వికెట్ కోల్పోయేది.. కానీ.. ఇషాంత్ శర్మ తప్పిదం కారణంగా ఆ వికెట్ చేజారగా.. ఆ తర్వాత కొద్దిసేపటికే గిప్ట్ రూపంలో అదే వికెట్ భారత్‌కి దొరికింది.
ఇషాంత్ శర్మ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్ రెండో బంతికే వికెట్ల ముందు ఆస్ట్రేలియా ఓపెనర్ అరోన్ ఫించ్ ఎల్బీడబ్ల్యూగా దొరికిపోయాడు. కానీ.. అతను అంపైర్ ఔట్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ డీఆర్‌ఎస్‌కి వెళ్లగా.. ఇషాంత్ శర్మ క్రీజు వెలుపల కాలు పెట్టి బంతి (నోబాల్) విసిరినట్లు రి ప్లై లో తేలింది. దీంతో.. అతను నాటౌట్ అని అంపైర్ ప్రకటించారు.
ఈ మ్యాచ్‌లో ఈరోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 104/4తో నిలవగా.. ఆ జట్టు విజయానికి ఇంకా 219 పరుగులు చేయాల్సి ఉంది. మ్యాచ్‌లో ఆఖరిరోజైన సోమవారం 6 వికెట్లు చేతిలో ఉన్న ఆస్ట్రేలియా ఏ మేరకు భారత్‌పై పోరాడుతుందో..? చూడాలి..!
South Africa tour of India 2019



Comments